: కేదార్ నాథ్ లో సహాయచర్యలకు పొగమంచుతో తంటా
వరద బీభత్సం సృష్టించిన విలయంలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత మూడ్రోజులుగా ప్రశంసనీయరీతిలో సహాయచర్యలు చేపట్టిన సైన్యానికి ప్రకృతి అవరోధంగా నిలుస్తోంది. ఈ ఉదయం కేదార్ నాథ్ ప్రాంతంలో భారీగా పొగమంచు ఆవరించడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. కేదార్ నాథ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఇంకా 1000 మంది వరకు చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, కేదార్ నాథ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వైమానిక దళ సిబ్బంది సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు.