: భార్యను 300 ముక్కలు కోసిన భర్త
మనుషుల్లో పైశాచికత్వం పెరిగిపోతుంది అనడం కంటే ముదిరిపోతోంది అనడం కరెక్టేమో. ఈ వార్త వింటే అలాగే అనిపిస్తోంది మరి. ఒరిస్సాలో సోమ్ నాథ్ పరీడ అనే 71 ఏళ్ల ఆర్మీ విశ్రాంత వైద్యుడిని ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఆయన చేసిన నేరమేమిటో చదివితే ఒళ్లు గగుర్పొడాల్సిందే. ఏళ్లుగా కాపురం చేసిన తన భార్యను దారుణంగా చంపేశాడు. అంతేకాకుండా ఆమె శరీరాన్ని 300 ముక్కలుగా కోసేశాడు. ఈ దంపతుల పిల్లలు విదేశాల్లో ఉండడంతో వీరిద్దరే ఇంట్లో ఉంటున్నారు. దీంతో ఈ ఘాతుకానికి అడ్డు లేకుండా పోయింది. ఎందుకు చంపాడో కారణం ఇంకా తెలియడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.