: ఈ చాక్లెట్లు ఎన్ని తిన్నా ఏం కాదు!


చాక్లెట్లంటే బోలెడంత ఇష్టం. కానీ, అందులో ఉన్న అధిక కేలరీల కారణంగా తప్సనిసరై నోరు కట్టేసుకుంటుంటారు కొందరు. కానీ చాక్లెట్ ప్రియులు ఇక తమకు కావాల్సినన్ని చాక్లెట్లు తినేయవచ్చు. భారత సంతతికి చెందిన లండన్ వాసి అనీష్ తక్కువ కేలరీలతో ఒక చాక్లెట్ ను తయారు చేశాడు. ఒక్కో చాక్లెట్ లో 20 కేలరీల కంటే తక్కువగానే ఉంటాయట. కనుక ఎన్నైనా మింగవచ్చు. కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ తాను రూపొందించిన చాక్లెట్ రుచిలో అమోఘంగానే ఉంటుందని అనీష్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ చాక్లెట్లను వాణిజ్య పద్ధతిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని అనీష్ భావిస్తున్నాడు.

  • Loading...

More Telugu News