: 'బాల్ ఆఫ్ దిస్ సెంచరీ' రేసులో అశ్విన్ బంతి!


క్రికెట్ పండితుల్లో ఇప్పుడో కొత్త చర్చ ప్రారంభమయింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో మొన్న జరిగిన సెమీస్ లో కులశేఖరను ఔట్ చేసిన అశ్విన్ బంతి ఈ చర్చకు కారణమౌతోంది. బాల్ ఆఫ్ దిస్ సెంచరీ రేసులో ఈ బంతి నిలుస్తుందనేది క్రికెట్ మేధావుల వాదన. అశ్విన్ విసరిన ఈ క్యారమ్ డెలివరీ.. క్రీజుకు లెగ్ దిశ వైపు చాలా దూరంలో పడింది. ఎంత తిరిగినా.. 'వికెట్ దరిదాపుల్లోకి రావడం కచ్చితంగా అసాధ్యమే'.. అని కులశేఖర ఆ బంతిని పట్టించుకోవడం మానేశాడు.

వికెట్ కీపర్ ధోనీ కూడా 'ఎలాగూ వెైడ్ వెళ్తుంది. ఫోర్ వెళ్లకుండా చూసుకుందాం' అని నిశ్చయించుకొని ప్యాడ్స్ అడ్డంగా పెట్టాడు. అయితే వీరి అంచనాలను తారుమారు చేసేసింది. విపరీతమైన స్పిన్ తిరిగి లెగ్ స్టంప్ ను ఎగరగొట్టేసింది. అందరూ ఔట్ అనే ఆనందంలో ఉండగా ఆశ్చర్యం నుంచి తేరుకోని కులశేఖర నమ్మబుద్ది కాక అంపైర్ ను మళ్లీ అడిగాడు. రివ్యూలో బంతి విన్యాసం చూసి ఆశ్చర్యంతో వెనుదిరిగాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ వేసిన బంతి కూడా ఇటువంటి విన్యాసమే చేసింది.

  • Loading...

More Telugu News