: సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : జేసీ


స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. త్వరలోనే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో అందరూ కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News