: భర్త అనుమానాస్పద మృతి.. పరారీలో భార్య
కర్నూలు జిల్లాలో నరసింహుడు అనే ట్రాన్స్ కో అసిస్టెంట్ లైన్ మ్యాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జిల్లాలోని అవుకు గ్రామంలో ఈ ఘటన జరిగింది. నరసింహుడి మృతదేహం ఈ ఉదయం అతని ఇంట్లోనే దూలానికి వేళ్ళాడుతూ కనిపించింది. అయితే, అతని భార్య పరారవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నరసింహుడిని అతడి భార్యే హత్య చేసి దూలానికి వేళ్ళాడదీసి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అంటున్నారు.