: జీవో నెంబరు 166ను రద్దు చేయండి : రాఘవులు
భూ అక్రమాలకు ఊతమిస్తోన్న జీవో నెంబరు 166ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కోరారు. ఈ మేరకు రెవిన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డికి ఈ రోజు ఆయన లేఖ రాశారు. ఈ జీవో వల్ల చాలా ప్రాంతాల్లో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని రాఘవులు ఆరోపించారు.
2003కి ముందు సర్కారు భూములలో నివాసం ఏర్పరచుకున్న వారికి ఆ స్థలాలను వారి పేరుతో క్రమబద్దీకరించే విధంగా జీవో 166ను అప్పట్లో వైయస్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ జీవోతో ఖుషీగా భూములను క్రమబద్దీకరించి, వేలాది కోట్ల రూపాయలను సర్కారు దండుకునే యత్నం చేస్తోందని పార్టీల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.