: మనవాళ్లకు మనోడు ఇస్తున్న ధైర్యం...
ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం వరద బీభత్సం చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. యాత్రకు వెళ్లిన తమ వారి పరిస్థితి ఎలా వుందోనని పలువురు ఆందోళన పడుతున్నారు. అయితే ఎవరూ అధైర్య పడవద్దు... నేనున్నానంటూ మన రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్ కలెక్టర్ హామీ ఇస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో పరిస్ధితి కొన్ని చోట్ల మాత్రమే ఇబ్బందికరంగా ఉందని, మీడియాలో కథనాలను చూసి ఆందోళన చెందవద్దని, మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే వారి ఉనికి గురించి తనకు తెలియజేస్తే వారిని క్షేమంగా తమ వారివద్దకు చేర్చే బాధ్యత తనదని ఉత్తరాఖండ్‌లో కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన బసవ వెంకట రామచంద్ర పురుషోత్తం హామీ ఇస్తున్నారు. తమ వారికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా తనకే చెప్పవచ్చని తన ఫోన్ నంబర్ 09411144444 కు సంప్రదించవ్చని ఆయన చెబుతున్నారు. అసలే తమ బంధువులు, స్నేహితులు ఎక్కడున్నారో అని ఆందోళన చెందుతున్న మన రాష్ట్రంలోని వారికి మనవాడి రూపంలో ఒక ఆసరా దొరికినట్టయింది. రామచంద్ర పురుషోత్తం 2004 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికై ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ వరదల్లో రక్షణ, పునరావాసం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.