: ప్రాచీన లిఖిత ప్రతికి అరుదైన గుర్తింపు
ప్రాచీన కాలం నాటి ఒక లిఖిత ప్రతికి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అరుదైన గుర్తింపు నిచ్చింది. భారతదేశంలో జనించిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ప్రస్తుత కాలంలో కనుమరుగైపోతున్నా... జైన మత బోధకుల్లో ఒకరైన 16వ తీర్ధంకరుడైన శాంతినాధుడు లిఖించిన ఒక ప్రాచీన లిఖిత ప్రతిని పరిశీలించిన యునెస్కో సంస్థ ప్రపంచంలోనే అరుదైన పత్రాల్లో ఒకటిగా దీనికి గుర్తింపు నిచ్చింది.
ఇక్ష్వాకు వంశానికి చెందిన శాంతినాధుడు జైనమత ప్రభోధకుల్లో 16వ వాడు. ఈయన జీవిత విశేషాలను వివరించే అతి ప్రాచీన లిఖిత ప్రతిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన పత్రాల్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. అరుదైన ప్రాచీన కళకు ఇలాంటివి నిదర్శనం.