: మళ్లీ రాష్ట్రాన్ని పలకరించనున్న వరుణుడు
గత పక్షం రోజులుగా రాష్ట్రానికి ఉపశమనాన్ని కలిగించిన వరుణుడు మరోసారి రాష్ట్రాన్ని పలకరించేందుకు సిద్దమౌతున్నాడు. రాగల 28 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షం కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొన్న పడ్డ వానకే చెరువులు, కుంటలు కాస్త జలకళను సంతరించుకున్నాయి. మళ్లీ వానలు పడితే అవన్నీ నిండి అన్నదాత నారు మళ్లకు నీటి ఇక్కట్లు తీరినట్టేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.