: 'బ్యాడ్మింటన్ లీగ్' లో సచిన్ టెండూల్కర్


భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాడ్మింటన్ లీగ్ లో ప్రవేశిస్తున్నాడు. అయితే, క్రీడాకారుడిగా మాత్రం కాదండోయ్. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) త్వరలోనే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభించబోతోంది. ఈ లీగ్ లో వివిధ భారత నగరాల నుంచి జట్లు బ్యాడ్మింటన్ లీగ్ లో పాలుపంచుకుంటాయి. కాగా, ఈ టోర్నీలో పాల్గొనే ముంబయి మాస్టర్స్ ఫ్రాంచైజీని సచిన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నాడు. లీగ్ లో తొలి జట్టును పీవీపీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఆ సంస్థ హైదరాబాద్ హాట్ షాట్స్ ను స్వంతం చేసుకుంది.

ఇంకా ముంబయి మాస్టర్స్, పుణే విజేతాస్, రాజధాని స్మాషర్స్ (ఢిల్లీ), కర్ణాటక కింగ్స్ (బెంగళూరు), లక్నో వారియర్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా, లక్నో జట్టును సహారా.. పుణే జట్టును డాబర్ స్వంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తారు. తొలిసారి భారత్ లో ప్రవేశపెడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక లీగ్ లో విదేశీ ఆటగాళ్ళనూ బరిలో దించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News