: గాలి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన రెడ్డి బెయిలు పిటిషన్ పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. తొలుత, పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం గాలికి బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు ఉంటే కౌంటరు పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను అడిగింది. అందుకు స్పందించిన సీబీఐ అధికారులు కౌంటరు దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు. దాంతో విచారణను వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. 

  • Loading...

More Telugu News