: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న మాకినేని పెదరత్తయ్య!
మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఆయన నేడు హైదరాబాద్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. మాకినేనికి కాంగ్రెస్ ప్రవేశానికి మార్గం సుగమం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకేనేమో, మాకినేనిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడించారు. అయితే, మాకినేని పార్టీలో ఎప్పుడు చేరేది తెలియరాలేదు. మాకినేని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వ్యవహరించారు. కొద్దికాలం నుంచి ఆయన టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.