: మరో ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తోంది: డబ్ల్యూహెచ్ఓ


మానవాళిని కబళించేందుకు మరో ప్రమాదకర వైరస్ వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ ప్రాణాంతక వైరస్ పేరు కొరోనా అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇది శ్వాస కోశ సంబంధమైన వ్యాధులకు కారణమవుతుందని తెలిపింది. కనుక జలుబు, దగ్గు తదితర శ్వాస సంబంధ అనారోగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఈమేరకు ప్రపంచ దేశాలకు కొత్త వైరస్ కు సంబంధించిన సమాచారం అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయని, వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తులకు తొలుత సాధారణ జలుబు లక్షణాలే కనిపిస్తాయని, తదనంతరం తీవ్రమైన శ్వాస సంబంధ అనారోగ్యానికి దారితీస్తుందని తెలియజేసింది.

  • Loading...

More Telugu News