: రక్షించేందుకు వచ్చి కూలిన హెలికాప్టర్
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు కేంద్రం అనేక హెలికాప్టర్లను తరలించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి కేదార్ నాథ్ లో కూలిపోయింది. కేదార్ నాథ్ లో కూడా అనేకమంది యాత్రికులు చిక్కుకుపోయి ఉన్నారు. వీరిని కాపాడేందుకు ఓ హెలికాప్టర్ ను ఇక్కడకు పంపించారు. అయితే సాంకేతిక లోపంతో ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణిహాని జరగలేదని సమాచారం.