: మాజీ మంత్రి శంకర్రావుపై మరో కేసు
మాజీ మంత్రి శంకరరావుపై మరో కేసు దాఖలైంది. ముఖ్యమంత్రి, పోలీసు శాఖపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై నాంపల్లి హైకోర్టులో ఫిర్యాదు నమోదయింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో శంకరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్రావు కోడలినంటూ ఇటీవల ఓ మహిళ శంకర్రావు దంపతులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.