: సైనా మరో'సారీ'..
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తాజాగా, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ సైనాకు భంగపాటు తప్పలేదు. క్వార్టర్ ఫైనల్లో సైనా 21-17, 13-21, 10-21తో ఫనేత్రి (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలైంది. ఇటీవల కాలంలో సైనా తరచూ నిర్ణయాత్మక మ్యాచ్ లలో చతికిలబడుతూ అభిమానులను నిరాశపరుస్తోంది. కొద్దివారాల క్రితం ముగిసిన థాయ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ లోనూ ఈ హైదరాబాదీ ఫైనల్ చేరే క్రమంలో చేతులెత్తేసింది.