: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. 2,91,698 మంది పరీక్షలు రాయగా 1,22,344 మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. మార్కుల జాబితాలను 27నుంచి జారీ చేస్తామన్నారు. తప్పులుంటే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని, రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవడానికి 28 వరకూ గడువు ఇచ్చామని తెలిపారు. గుర్తింపులేని పాఠశాలలపై జరిమానాలు విధిస్తామని చెప్పారు. చట్టప్రకారం అంతకుమించి చర్యలు తీసుకోవడానికి వీలు పడదన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు విద్యార్ధులుగా పరిగణిస్తామని తెలిపారు.