: త్వరలో ఓ ఇంటివాడుకానున్న శ్రీశాంత్


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్ త్వరలో పెళ్లికొడుకు కానున్నాడు. ఈ కేసుతో కెరీర్ ను క్లిష్టం చేసుకున్న శ్రీశాంత్, జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో రాజస్థాన్ రాజకుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లి ఓనం పండగ తరువాత ఉంటుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. శ్రీశాంత్ సోదరి మాట్లాడుతూ 'శ్రీ నేరం చేయలేదు. కేవలం ఆరోపణల వల్లే అరెస్టయ్యాడు. సాధారణ కుటుంబాల్లాంటిదైతే ఈ ఆరోపణలకు పెండ్లి కుమార్తె కుటుంబం భయపడేది. కానీ, రాజకుటుంబం కావడంతో అర్ధం చేసుకుని ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. శ్రీశాంత్ అమాయకుడు' అంటోంది. పరిణయం కేరళ, రాజస్థాన్ సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉంటుందని, అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదని ఓనం పండగ తరువాత ఉండొచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News