: ఉపాధి హామీతో అవినీతికి అడ్డుకట్ట: సోనియా
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని మన్మోహాన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పాల్గొన్నారు. పేదరికం నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో ఉపాధి హామీ అతి పెద్దదని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మరో 30 పనులను ఈ పథకంలో చేర్చనున్నట్లు ప్రధాని తెలిపారు. ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో అధిక దిగుబడితోపాటు అవినీతిరహిత అభివృద్ధి సాధ్యమని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మరో హరిత విప్లవానికి నాంది అని ఆమె చెప్పారు.