: మా స్క్రిప్ట్ అద్భుతంగా పండింది: ధోనీ
శ్రీలంకపై విజయంలో తమ స్క్రిప్ట్ చక్కగా పనిచేసిందని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నారు. టాస్ గెలవడం, బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే విజయం సాధించామన్నారు. దురదృష్టం కొద్దీ శ్రీలంక దిల్షాన్ వికెట్ ను కోల్పోయిందని, దాన్ని తాము అనుకూలంగా మలచుకున్నామని చెప్పారు. బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారని, మంచి బౌలర్లు ఉండడం ముఖ్య పాత్ర పోషించిందన్నారు. గురువారం జరిగిన మ్యాచులో భారత్ శ్రీలంకను చిత్తుగా ఓడించి చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫైనల్లో మరో జట్టు ఇంగ్లండ్ ఉండడం మంచిదేనని ధోనీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లండ్ పై ఎన్నో మ్యాచులలో విజయం సాధించామన్న ధోనీ చాంపియన్స్ ట్రోఫీ కూడా తమదేనని పరోక్షంగా చెప్పారు.