: సబిత జైలుకు వెళ్లకపోవచ్చు?


జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా, దాల్మియా సిమెంట్స్ భూ కేటాయింపుల విచారణకు మాజీ మంత్రి సబిత నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఈ రోజు హాజరయ్యారు. ఇదే కేసులో దాల్మియా సిమెంట్స్ కు చెందిన పునీత్ దాల్మియా, ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా కోర్టుకు వచ్చారు. సబిత, ధర్మాన ప్రసాదరావును జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని కోరుతూ సీబీఐ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సబిత కోర్టుకు పూచీకత్తు సమర్పించారు. వీటిని కోర్టు ఆమోదించింది. అంతమాత్రాన సబితకు స్వేచ్ఛ కల్పించినట్లుగా సీబీఐ భావించరాదని కోర్టు పేర్కొంది. దీంతో సబిత ప్రస్తుతానికి జైలు వాసం తప్పించుకున్నట్లుగానే తెలుస్తోంది.

  • Loading...

More Telugu News