: భారత్ చేతిలో శ్రీలంక చిత్తు.. ఫైనల్లో టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. శ్రీలంకతో నిన్న జరిగిన సెమీస్ లో భారత్ 8 వికెట్ల తేడాతో లంకేయులను చిత్తు చేసింది. బౌలింగ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాంత్ శర్మ(3/33), అశ్విన్ (3/48) చెలరేగడంతో శ్రీలంక 8 వికెట్లకు 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాలో శిఖర్ దావన్ ఎప్పటిలాగే మరో అర్ధ సెంచరీ(68)తో శ్రీలంకతో ఆటాడుకోగా, కోహ్లీ (58నాటౌట్), రోహిత్ శర్మ (33) చెరో చేయి వేసి జట్టును సునాయాసంగా ఫైనల్ కు చేర్చేశారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ ను టీమిండియా ఢీ కొంటుంది.