: హర్భజన్ చెప్పిన వరద అనుభవాలు


ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ శిబిరంలో తలదాచుకున్న క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆ చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ వరద బీభత్సాన్ని విచారకరమని పేర్కొన్నాడు. నమ్మశక్యంకాని రీతిలో ఈ ఉత్పాతం సంభవించిందంటూ, అంత వరదనీరు ఒక్కసారిగా ఎలా చుట్టుముట్టిందో అర్థంకావడంలేదని విస్మయం వ్యక్తం చేశాడు. హర్భజన్ సింగ్ ఛార్ ధామ్ యాత్రలో భాగంగా సిక్కుల పవిత్ర క్షేత్రమైన హేమకుంత్ సాహిబ్ ను దర్శించేందుకు వెళుతుండగా వరదల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

జోషి మఠ్ వద్ద తాము చిక్కుకుపోయామని, భోరున వర్షం కురుస్తుండగా.. అటు ముందుకు వెళ్ళలేక, వెనక్కిరాలేక నరకం చవిచూశామని ఈ పంజాబీ ఆఫ్ స్పిన్నర్ తెలిపాడు. వరద ఉద్ధృతికి రోడ్లు కోతకు గురయ్యాయని భజ్జీ చెప్పాడు. కాగా, భారత వాయుసేన హెలికాప్టర్ సాయంతో హర్భజన్ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు.

  • Loading...

More Telugu News