: అజిత్ చండీలాను వీడని బెయిల్ కష్టాలు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అజిత్ చండీలాకు ఢిల్లీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. జూలై 2 వరకూ అజిత్ కు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు ఒకేసారి అరెస్టయినా చండీలా బెయిలుకు దరఖాస్తు చేసుకోలేదు. మరో వైపు జైలులో కూడా చండీలా ప్రవర్తన కాస్త చిత్రంగా ఉండేదని జైలు అధికారులు తెలిపారు. తనతోటివారంతా బెయిలుపై విడుదల కావడంతో బెయిలుకు దరఖాస్తు చేసుకున్న చండీలాకు బెయిలు దొరకలేదు సరికదా, మరి కొంత కాలం జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో చండీలాను కష్టకాలం ఇంకా వీడినట్లు లేదు.

  • Loading...

More Telugu News