: యాంటీబయాటిక్స్ కు వెండి జోడిస్తే.. తిరుగుండదా?


మనుషుల్లో పలు వ్యాధులకు ఉపయోగించే యాంటీబయాటిక్ ఔషధాలు మరింత శక్తిమంతం కావాలంటే వాటికి కాస్త వెండి లోహాన్ని జోడిస్తే చాలంటున్నారు హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు. వెండి కలిపిన యాంటీబయాటిక్స్ 10 నుంచి 1000 రెట్లు ప్రభావశీలత పొందుతాయని వారు తెలిపారు. ఎలుకల్లో కనిపించే ఓ రకం బ్యాక్టీరియాపై ఈ సిల్వర్-యాంటీబయాటిక్ కాంబినేషన్ ను ప్రయోగించగా.. ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయట. ఈ జోడీ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి ఎలుకలను కాపాడిందని హార్వర్డ్ పరిశోధన వెల్లడించింది.

మందులకు లొంగనిరీతిలో నిరోధకత స్వంతం చేసుకున్న మొండి బ్యాక్టీరియా సైతం వెండి జోడించిన యాంటీబయాటిక్స్ ధాటికి పలాయనం చిత్తగిస్తాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన జిమ్ కొలిన్స్ పేర్కొన్నారు. ఫుడ్ పాయిజనింగ్ కు కారణయ్యే బ్యాక్టీరియాతో పాటు, ఆసుపత్రుల్లో ఉండే అనేక రకాల ప్రమాదకర బ్యాక్టీరియాను సైతం ఈ కాంబినేషన్ అరికడుతుందని కొలిన్స్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News