: మెదడును అప్ లోడ్ చేస్తారట!


ఫొటోలను అప్ లోడ్ చేయడం తెలుసు.. ఆడియో, వీడియో ఫైళ్ళను అప్ లోడ్ చేయడం తెలుసు.. మరి మనిషి మెదడును అప్ లోడ్ చేయడం ఏమిటి? అసలిది సాధ్యమేనా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రజ్ఞులు. 2045కల్లా ఈ పరిజ్ఞానం మానవాళి ముంగిటకొస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కిందటివారం న్యూయార్క్ నగరంలో జరిగిన గ్లోబల్ ఫ్యూచర్ 2045 ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సదస్సులో ఈ ఆశ్చర్యకర విషయం చర్చకొచ్చింది. రష్యా కుబేరుడు దిమిత్రీ ఇట్స్కోవ్ నిర్వహిస్తోన్న ఈ సదస్సులో పలు ఆవిష్కరణలు చర్చకు వచ్చాయి.

జోస్ కార్మెనా, మైకేల్ మహార్బిజ్ అనే ఎలక్ట్రికల్ ఇంజీనీర్లు బీసీఐ (బ్రెయిన్-మెషీన్ ఇంటర్ ఫేస్) పేరిట ఓ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని సాయంతో మెదడును అప్ లోడ్ చేయొచ్చట. దానికుండే ఎలక్ట్రోడ్లు మెదడు నుంచి వెలువడే నాడీ సంకేతాలను రికార్డు చేస్తాయని.. ఆ సంకేతాలను కంప్యూటర్ డీకోడ్ చేయగా.. ఆ ఆదేశాలను అనుసరించి రోబోలను నడిపించవచ్చని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News