: అకాల వర్షాల బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం


అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో పంటలు భారీగా దెబ్బతిన్న నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే, పర్యటన వివరాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా, ఈ రోజు సీఎం అకాల వర్షాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో పంట నష్టం అంచనా, రైతులకు అందాల్సిన తక్షణ సహాయం తదితర అంశాలపై సీఎం చర్చిస్తారు.
  

  • Loading...

More Telugu News