: బెయిల్ పై బయటికొచ్చి.. కత్తిపట్టిన రేపిస్టు
అతగాడో రేపిస్టు. పేరు నీలూ స్వయిన్. రెండేళ్ళక్రితం ఓ వివాహితపై దారుణంగా అత్యాచారం జరిపి జైలుకెళ్ళాడు. ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చిన ఆ కర్కోటకుడు కత్తిపట్టాడు. తనపై కేసును వాపసు తీసుకొమ్మంటూ బాధితురాలి బంధువులను బెదిరించాడు. అయితే, ఆ కామాంధుడికి శిక్ష పడాల్సిందే అని ఆమె కుటుంబీకులు దృఢసంకల్పం ప్రదర్శించారు. అదే వారిపాలిట శాపమైంది. తన మాటను లక్ష్యపెట్టలేదన్న కసితో ఆ అత్యాచార బాధితురాలి అత్తను కిరాతకంగా నరికాడు. దీంతో, ఆ వృద్ధురాలు అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లా సనాసువారా గ్రామంలో జరిగింది. ప్రస్తుతం స్వయిన్ పరారీలో ఉన్నాడు. పోలీసు బృందాలు అతడికోసం గాలిస్తున్నాయి.