: నో డౌట్.. కప్ మాదే: ఇంగ్లండ్ కెప్టెన్ ధీమా
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన సెమీస్ లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పటిష్టమైన దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ మాట్లాడుతూ, కప్ తమదేనని ధీమా వ్యక్తం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. కాగా, టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. కుక్ సేన భారత్-శ్రీలంక సెమీస్ విజేతతో టైటిల్ పోరులో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ పై దృష్టి కేంద్రీకరించిన కుక్.. తమ ప్రధాన బౌలర్ జేమ్స్ ఆండర్సన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. జిమ్మీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణిస్తాడని కితాబిచ్చాడు. ఫైనల్లో ఎవరెదురైనా తమకు ఒక్కటే అని సమరసన్నద్ధత చాటాడు.