: టాస్ గెలిచారు.. మరి మ్యాచ్!?
చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం అంతరాయాలు కలిగించి, డక్ వర్త్-లూయిస్ విధానాన్ని అనుసరించాల్సి వస్తే.. ఛేజింగ్ చేయడం ద్వారా విజయానికి అవసరమైన రన్ రేట్ ను మెయింటైన్ చేయవచ్చనేది ధోనీ ఎత్తుగడలా కనిపిస్తోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ లీగ్ దశలో ఆడిన జట్టునే కొనసాగిస్తుండగా.. లంక జట్టులో రెండు మార్పులు జరిగాయి. వైస్ కెప్టెన్ దినేశ్ చాందిమల్, షమింద ఎరంగలను తప్పించి వారి స్థానంలో జీవన్ మెండిస్, తిసర పెరీరాలను జట్టులోకి తెచ్చారు.