: వివాహానికి ముందు శృంగారం గురించి నే చెప్పింది కరెక్టే: కుష్బూ


వివాహానికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే దానిని వివాహబంధంగానే పరిగణించాల్సి ఉంటుందంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని నటి కుష్బూ అన్నారు. సొసైటీలో వివాహానికి ముందు శృంగారం ఉందంటూ హైకోర్టు చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. హైకోర్టు తీర్పు మహిళల హక్కులను రక్షించేదిగా ఉందన్నారు.

2005లో తాను కూడా ఇదే చెప్పానంటూ గత అనుభవాలను కుష్బూ గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివాహానికి ముందు శృంగారం ఉందంటూ నాడు తాను చెప్పిన దాన్ని ఎందుకు ఖండించారు? అని ఆమె ప్రశ్నించారు.

2005లో ఎయిడ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా కుష్బూ మాట్లాడుతూ.. శృంగార పరమైన సుఖ వ్యాధులు, అవాంచిత గర్భం నుంచి రక్షణ లభించాలంటే బాలికలను దానికి దూరంగా ఉంచాలని చెప్పారు. శృంగారంలో పాల్గొనాలంటూ జంటను ప్రోత్సహించరాదని, అదే సమయంలో అందులో పాల్గొనకుండా వారిని అడ్డుకోరాదంటూ ఆమె తన అభిప్రాయం చెప్పారు. శృంగారం వారి ప్రాథమిక హక్కు అని కుష్బూ చేసిన వ్యాఖ్యలతో ఆమెపై కేసు దాఖలైంది. తర్వాత సుప్రీంకోర్టు దానిని కొట్టివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News