: డీసీసీబీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
జిల్లాల కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికలు ఈ రోజు మొదలయ్యాయి. ముందుగా ఓట్ల నమోదు కార్యక్రమం చేబట్టారు. అనంతరం ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల ద్వారా ఎవరెవరి బలాబలాలు ఏమిటనేది ఈ రోజు తేలిపోతుంది.
కాంగ్రెస్ పార్టీలోని వివిధ గ్రూపులు వుండడం వల్ల అవగాహన కోసం చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ప్రతి జిల్లాలోనూ పార్టీకి సమస్యలు తలెత్తాయి. చివరికి ముఖ్యమంత్రి, పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చొరవ తీసుకుని, అన్ని జిల్లాల నాయకులతోనూ మాట్లాడి, సద్దుబాట్లు చేయడంతో అవగాహన కుదిరింది. మిగిలిన పార్టీలు కూడా తమ వ్యూహాలు తాము చేసుకుంటున్నాయి