: బ్యాంకు ఉద్యోగులా... మజాకా?


తిరుపతిలో ఘరానా మోసం బయటపడింది. వీసమెత్తు బంగారం లేకుండా గోల్డ్ లోన్ పేరుతో బ్యాంకులో భారీ మొత్తాన్ని తుడిచిపెట్టేశారు అక్కడి ఉద్యోగులు. బ్యాంకు ఉద్యోగుల హస్తలాఘవానికి ఉన్నతాధికారులు బిత్తరపోయారు. వివరాల్లోకెళితే, తిరుపతి ట్రావెన్ కోర్ బ్యాంకులో ఇద్దరు ఉద్యోగులు బంగారం లోన్ పేరిట 70 లక్షల భారీ మోసానికి పాల్పడ్డారు. వీసమెత్తు బంగారం తాకట్టు పెట్టకుండానే 70 లక్షలు స్వాహా చేసేశారు.

నాలుగు రోజుల్లోనే 23 లక్షలు బ్యాంకు నుంచి గల్లంతవడంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు ఉద్యోగులను ప్రస్తుతం విచారిస్తున్నారు. మొన్న తాజాగా విజయనగరంలోని రామభద్రపురం బ్యాంకు మేనేజర్ స్వయానా భారీ మొత్తాన్ని స్వాహా చేసేశారు. ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తున్న బాగోతాలతో సామాన్యులు బ్యాంకు ఉద్యోగులా... మాజాకా? అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News