: ఎలాంటి విచారణకైనా సిద్ధం: తెరాస


ఆస్తుల విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని తెరాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి సంపాదించిన ఆస్తుల విషయంలో విచారణ చేసుకోవాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తమపై విషప్రచారం చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

కేసీఆర్ ఆస్తులపై విచారణ చేయాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోసం అమరులైనవారి మరణ వాంగ్మూలాలను రేపు బైటపెడతామని రాజేందర్ చెప్పారు. అందులో తమ పేర్లు ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనని, టీడీపీ నేతల పేర్లు ఉంటే వారు శిక్షకు సిద్ధమేనా? అంటూ సవాల్ చేశారు.

  • Loading...

More Telugu News