: సత్తా చాటిన తెలుగు హీరోలు
తెలుగు సినిమా హీరోలు తెర మీదే కాకుండా మైదానంలో కూడా తమ సత్తా చూపారు. నిన్న హైదరాబాదులో జరిగిన సీసీఎల్ -3 క్రికెట్ పోటీలలో తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయం సాధించి, తన సత్తా చాటింది. బాలీవుడ్ తారల జట్టయిన ముంబయ్ హీరోస్ తో తలపడిన తెలుగు వారియర్స్ జట్టు వారికి దీటైన సమాధానం ఇచ్చింది.
135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదర్శ్ (58 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తెలుగు వారియర్స్ జట్టులోని రామ్ చరణ్, వెంకటేష్ లు బ్యాటింగ్ చేసి, సిక్సర్లు కొడతారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. ఎందుకంటే, వారసలు బ్యాటింగుకు దిగవలసిన అవసరమే రాలేదు!