: కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణకు ఎర్రబెల్లి డిమాండ్


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ సెటిల్ మెంట్లపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిన్న కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేతల భూ కబ్జాలు, సెటిల్ మెంట్లను నిరసిస్తూ టీడీపీ నేతలు అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ వద్ద ఈ రోజు నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News