: ఆరోగ్య బీమా పాలసీలు కాస్త భారం
ఆరోగ్యానికి రక్షణ కల్పించే బీమా పాలసీలు కొంత భారం కానున్నాయి. ప్రభుత్వ రంగంలోని నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్యబీమా పాలసీల ప్రీమియం ధరలు పెంచడానికి రెడీ అయ్యాయి. 20 నుంచి 30 శాతం వరకూ పెరగడానికి అవకాశం ఉందని సమాచారం. ప్రీమియం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవి ఆమోదం పొందాయి. ఆరోగ్య బీమా పాలసీల మార్కెట్లో యునైటెడ్ ఇండియా, న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు 70 శాతం వాటా ఉంది. ఇవి ధరలు పెంచితే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రీమియం ధరలు పెంచే అవకాశం ఉంటుంది.