: కంటినిండా నిద్రతో మధుమేహం దూరం దూరం!


ఎవరైనా ఎక్కువ సేపు నిద్ర పోతుంటే వీడెవడ్రా కుంభకర్ణుడి కజిన్ బ్రదర్లా ఉన్నాడు... అనడం పరిపాటి. కానీ, ఆ అతినిద్ర కూడా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సేపు నిద్రపోయే పురుషుల్లో టైప్-2 డయాబెటిస్ దరిచేరదట. ఎందుకంటే, సుఖనిద్ర వల్ల వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి శాతం పెరుగుతుందని లాస్ ఎంజెల్స్ బయోమెడికల్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రజ్ఞులు అంటున్నారు. వరుసగా మూడు రాత్రులు కంటినిండా నిద్రపోయిన పురుషుల్లో.. రక్తంలోని చక్కెర నిల్వలను కరిగించడానికి తగినంత మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అయిందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News