: పనిభారం తట్టుకోలేక కుప్పకూలిన మంత్రి


'అతి సర్వత్ర వర్జయేత్' అన్న నానుడి ఈ మంత్రిగారి విషయంలో రుజువైంది. ఏదైనా మోతాదు మించితే విషమిస్తుంది అన్నదే ఆ నానుడి అర్థం కాగా.. మితిమీరిన పనిభారంతో మిజోరాం రాష్ట్ర మంత్రి ఒకరు ఆఫీసు గదిలోనే కుప్పకూలారు. మిజోరాం క్రీడల శాఖ మంత్రి జోడింట్ లూవాంగాకు ఈ అనుభవం ఎదురైంది. ఈ మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో పని చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కిందపడిపోయారు. పరీక్షించిన వైద్యులు తొలుత కార్డియాక్ అరెస్ట్ (గుండె పట్టేయడం) అని అనుమానించినా.. ఆ తర్వాత పని భారం ఎక్కువ కావడం వల్లనే మంత్రి కుప్పకూలారని తేల్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News