: నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్లు
చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికా జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపారు. పేస్ కు అనుకూలించే పిచ్ పై నిప్పుల వర్షం కురిపించారు. బ్రాడ్ (3), ఆండర్సన్ (2), ట్రెడ్ వెల్ (3), ఫిన్ (1) సఫారీ బ్యాట్స్ మెన్ ను ఏ దశలోనూ కోలుకోనీయకుండా కకావికలం చేశారు. దీంతో, ఆ జట్టు ఓవర్లన్నీ ఆడకుండానే 38.4 ఓవర్లలో 175 పరుగులకే చాపచుట్టేసింది. మిడిలార్డర్లో డేవిడ్ మిల్లర్ (56 నాటౌట్), లోయరార్డర్లో క్లీన్ వెల్ట్ (43) రాణించకుంటే, దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా సాధించి ఉండేది కాదు. వీరిద్దరూ 9వ వికెట్ కు 95 పరుగులు జోడించడం విశేషం.