: మరో 24 గంటలు రాష్ట్రవ్యాప్తంగా వానలు: విశాఖ వాతావరణ కేంద్రం


అకాల వర్షాలతో ఇప్పటికే కుదేలైన రాష్ట్ర రైతాంగానికి మరో దుర్వార్త. ఇప్పటికే తడిచిన పంటను ఆరబెట్టుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

  • Loading...

More Telugu News