: జాతీయ సైక్లింగ్ కోచ్ రుమా దుర్మరణం


జాతీయ జూనియర్ సైక్లింగ్ జట్టు కోచ్ రుమా చటోపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 50 సంవత్సరాల వయసున్న రుమా మంగళవారం ఉదయం సైక్లిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపైకి వెళ్లారు. నిద్రమత్తులో ట్యాక్సీ నడిపిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి సైకిల్ నడుపుతున్న రుమా బలయ్యారు. అంతర్జాతీయ పోటీలకు భారత్ తరపున రుమా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆసియన్ గేమ్స్, ఆసియన్ చాంపియన్ షిప్ తో కలిపి ఏడుసార్లు రుమా కోచ్ గా సేవలందించారు.

  • Loading...

More Telugu News