: ఐదువేల మంది గల్లంతు.. ఉత్తరాఖండ్ లో హెల్ప్ లైన్లు
భారీ వర్షాలు, గంగమ్మ ఉగ్రరూపం, ప్రకృతి ప్రకోపం వల్ల ఉత్తరాఖండ్ రాష్టంలోని గౌరీకుండ్ వద్ద సుమారు 5వేల మంది ఆచూకీ లభించకుండా పోయింది. సహాయక దళాలు వారి కోసం అన్వేషిస్తున్నాయి. బాధితులను రక్షించడానికి కేదార్ నాథ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వరదలకు కొట్టుకుపోయింది. బాధితులకు సంబంధించిన సమాచారం, సహాయం కోసం అక్కడ పలు హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉత్తరకాశీ(01374-226126, 01374-226161) చమోలి(01372-251437), తెహ్రీ(01376-233433) కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే, కేంద్ర పారామిలటరీ దళం ఐటీబీపీ కూడా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 011-24362892, 9968383478 నంబర్లను సంప్రదించవచ్చు.