: ఫెయిలైనా పాసైనట్లే?
జేఎన్ టీయూ హెచ్ లో ఇంజనీరింగ్ విద్యార్థులకు కలిసొచ్చే కాలం వచ్చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులు బీటెక్ పట్టా అందుకోవాలంటే అన్ని సబ్జెక్టులలో కలిపి 200 క్రెడిట్స్ పొందాలి. వాటిని 192కు తగ్గిస్తూ యూనివర్సీటీ అకడమిక్ సెనేట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే రెండు సబ్జెక్టులలో ఫెయిలైనా వాటి నుంచి తమను మినహాయించాలని విద్యార్థులు కోరవచ్చు. దీంతో ఫెయిలైనా పాసైపోతారు. ఈ నిర్ణయాలకు యూనివర్సీటీ పాలకమండలి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.