: కాక్రోచ్ కాదు 'రోబోరోచ్'!
కాక్రోచ్... కాదు ఇది రోబోరోచ్. మనం సైన్స్ ఫిక్షన్ నవలల్లోను, సినిమాల్లోను చూసేవుంటాం... సగం శరీరం మనిషిలాగా, సగం శరీరం యంత్రంలాగా... ఉండే జీవులు. ఇలా సగం ప్రాణి రూపంలోను, సగం యంత్రం రూపంలోను ఉండే విచిత్ర జీవాలను సైన్స్ పరిభాషలో 'సైబోర్గ్' అని పిలుస్తుంటారు. ఇవి మనుషులు చెప్పినట్టు వింటుంటాయి. అయితే ఇప్పుడు ఇలాగే సగం ప్రాణిలాగా, సగం యంత్రం లాగా ఉండే ఒక బొద్దింకను తయారు చేశారు, అమెరికాలోని మిచిగాన్ శాస్త్రవేత్తలు.
మొబైల్ యాప్ ద్వారా సదరు సైబోర్గ్ అదే మరబొద్దింక మనం ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళుతుందట. రమ్మంటే వస్తుందట. ఇలా తయారు చేశారు. ఈ కొత్తరకం ప్రాజెక్టుకు 'రోబోరోచ్' అనేపేరు పెట్టారు. బ్యాక్‌యార్డ్ బ్రెయిన్స్ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. రోబోరోచ్ బాగుందికదూ...!