: చిరంజీవితో విదేశీ రాయబారి భేటీ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నేడు ఢిల్లీలో టర్కీ రాయబారి బ్యురాక్ అక్బర్ తో భేటీ అయ్యారు. వీరిమధ్య పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఇరు దేశాల పర్యాటకుల సౌకర్యార్థం రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందని టర్కీ రాయబారి చిరంజీవికి సూచించారు. ఈ మేరకు ఉమ్మడి కార్యక్రమం చేపట్టాలని ఆయన చిరంజీవికి చెప్పారు.