: అమెరికాలో బ్రూస్ లీ విగ్రహం ఆవిష్కరణ
మార్షల్ ఆర్ట్స్ ను తనదైనశైలిలో ప్రపంచానికి పరిచయం చేసిన చైనా వీరుడు బ్రూస్ లీ విగ్రహాన్ని నేడు అమెరికాలో ఆవిష్కరించారు. ఎంటర్ ది డ్రాగన్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, రిటర్న్ ది డ్రాగన్, ది బిగ్ బాస్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్రూస్ లీ చిన్న వయసులోనే కన్నుమూశాడు. ఈ ఏడాది బ్రూస్ లీ 40వ వర్ధంతిని పురస్కరించుకుని, లాస్ ఏంజెల్స్ చైనాటౌన్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. లీ 1940 నవంబర్ 27న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా, యాక్టర్ గా, డైరక్టర్ గా పలు రంగాల్లో బ్రూస్ లీ తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అంతేగాకుండా.. కలం చేతబట్టి కొన్ని కవితలు కూడా రాయడం విశేషం.