: ఖతార్ లో ఆఫీసు తెరిచిన తాలిబాన్లు


వీళ్ళను మించిన మూర్ఖులు మరొకరు ఉండరన్న రీతిలో ఈ ఛాందసుల చేష్టలుంటాయి. మతాచారాలు సరిగా పాటించడంలేదని మహిళలకు జట్టు కత్తిరించడం, పాఠశాలలకు వెళుతున్నారని చిన్నారులకు కఠిన శిక్షలు విధించడం, జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారని యువతీయువకులను తలక్రిందులుగా వేలాడదీయడం.. ఇవన్నీ తాలిబాన్ల నైజానికి తార్కాణాలు. ఆఫ్ఘనిస్తాన్ లో వేళ్ళూనుకుపోయిన ఈ మతమౌఢ్యులు తాజాగా ఖతార్ రాజధాని దోహాలో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వీరు ప్రపంచ దేశాలతో చర్చలు సాగించడం వంటి దౌత్యపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారట. ఈ క్రమంలో తాలిబాన్లతో శాంతి చర్చలు జరిపేందుకు అమెరికాతో పాటు ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. మరికొద్దిరోజుల్లో ఈ చర్చలు కార్యరూపం దాలుస్తాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News