: హిందూ దేశం కాదిది.. లౌకిక దేశం: శంకరరావు
ఈ దేశం హిందూ దేశం కాదని, లౌకిక దేశమనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించాలని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. దేశప్రజలు లౌకిక పాలకుడినే కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాలిలో నరేంద్రమోడీ కొట్టుకుపోవడం ఖాయమని శంకరరావు జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి పదవిపై రాహుల్ ఆసక్తి చూపితే తనకు సంతోషమేననే మన్మోహన్ సింగ్ మాటల్ని స్వాగతిస్తున్నట్లు శంకరరావు తెలిపారు.